Prakash Raj : నంద..బద్రి ని వదలవా ఇక..?

Prakash Raj : డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరోచోట డిప్యూటీ సీఎం ఏది పడితే అది మాట్లాడతాడంటూ..

Published By: HashtagU Telugu Desk
Pawan Prakash War

Pawan Prakash War

బద్రి (Badri) సినిమాలో నువ్వు నంద వైతే నాకేంటి..నేను బద్రి..బద్రీనాధ్ అని గట్టిగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) మీద అరిసేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..రియల్ లైఫ్ లో మాత్రం ప్రకాష్ రాజ్ పై అరవలేకపోతున్నారు. దీనికి కారణం ప్రజలు తనపై పెట్టిన బాధ్యత. ఆ బాధ్యత వల్లే పవన్ కళ్యాణ్..తనపై ప్రకాష్ రాజ్ ఎన్ని విమర్శలు చేసిన..సెటైర్లు వేసిన పట్టించుకోకుండా సైలెంట్ గా ఉంటున్నాడు.

గత కొద్దీ రోజులగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ దీనిపై వరుస ట్వీట్స్ చేస్తూ హిందువుల్లో , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో , జనసేన శ్రేణుల్లో ఆగ్రహానికి గురి చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు లడ్డు వ్యవహారం లో సుప్రీం కోర్ట్ ..సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక లడ్డు అంశంపై సిట్ అధికారులే చూసుకుంటారని అంత ఫిక్స్ అయ్యారు.

ఇదిలా ఉండగా సనాతన ధర్మం పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై పవన్ పలు వ్యాఖ్యలు చేయడం తో తమిళనాడు సర్కార్ పవన్ కళ్యాణ్ కేసు నమోదు చేసింది. ఈ అంశం పై కూడా పవన్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేస్తూ వస్తున్నాడు. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. మాకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఆయన సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరోచోట డిప్యూటీ సీఎం ఉన్నారు. అతను ఏది పడితే అది మాట్లాడతాడంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. విత్ డిప్యూటీ సీఎం అని పేర్కొటూ జస్ట్ ఆస్కింగ్ అనే క్యాప్షన్ తో ఉదయనిధి స్టాలిన్ తో దిగిన ఫొటోను ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వస్తున్నారు. మరికొంతమంది మాత్రం నంద ..బద్రి ని వదలవా..? బద్రికి తిక్కరేగితే ఎలా ఉంటుందో తెలుసు కదా…? అని హెచ్చరిస్తున్నారు.

ఇదే అంశంపై ఎనిమీ, మార్క్ ఆంటోని వంటి చిత్రాలను నిర్మించిన వినోద్ కుమార్ స్పందించి ప్రకాష్ రాజ్ పరువు తీసాడు. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు.. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు.. అదే తేడా.. నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్.. కోటి రూపాయల నష్టం వచ్చింది.. చెప్పకుండా కేరవాన్లోంచి అటు నుంచే అటే పారిపోయావ్.. కాల్ చేస్తా అన్నావ్.. ఇంత వరకు చేయలేదు అంటూ ప్రకాష్ రాజ్ పరువుతీశాడు. ఈ ట్వీట్ ను పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Read Also : Stuck At 6000 Metres : 3 రోజులు 6000 మీటర్ల ఎత్తులో.. మహిళా పర్వతారోహకులకు ఏమైందంటే ?

  Last Updated: 06 Oct 2024, 10:36 AM IST