Tirumala Laddu Controversy : తిరుమల లడ్డు వివాదం కాస్త ఇప్పుడు రాజకీయ వివాదంగా మరీనా సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున భక్తులు, హిందూ సంఘాలు, రాజకీయేతర పార్టీల నేతలు కాదు సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..దోషులకు కఠిన శిక్షలు వేయాలని , దేవుడు ఎవర్ని క్షమించరాని శాపనార్దాలు పెడుతున్నారు. సినీ ప్రముఖులు సైతం దీనిపై కౌంటర్లు , ప్రతికౌంటర్లు వేస్తున్నారు.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఫై ప్రకాష్ రాజ్ కౌంటర్లు వెయ్యడం..దానికి మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ సైతం విష్ణు ట్వీట్ కు రిప్లయ్ ఇచ్చారు. అసలు పవన్ ఏమన్నాడు..ప్రకాష్ రాజ్ ఏమని ట్వీట్ చేసాడు..దానికి విష్ణు ఏమన్నాడు అనేది చూద్దాం.
పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ లో.. ”తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటరేస్తూ.. ట్వీట్ చేశారు. ”డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)” అని పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఫై మా ప్రసిడెంట్ , హీరో మంచు విష్ణు (Manchu VIshnu) స్పందించారు. ‘తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్.. అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దానిలో తప్పుమీ ఉంది..? దానిలో మతపరమైన రంగు ఎక్కడ ఉంది..? అంటూ ప్రకాష్ రాజ్ కు విష్ణు ప్రశ్నించారు. దీనికి ప్రకాష్ రాజ్ రిప్లయ్ ఇచ్చాడు.
విష్ణు కన్నప్ప సినిమా టీజర్లోని ఆఖరి డైలాగ్ను హేళన చేస్తూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ‘ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే మీకు మీ ఆలోచన ఉంటుంది. నోటెడ్’ అని ట్వీట్ చేశారు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని హాష్ ట్యాగ్ ఇచ్చారు. గతంలో మా ఎలక్షన్ టైం లో ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణు మధ్య గట్టి ఫైటే జరిగింది. అప్పుడు ఇద్దరు కూడా నువ్వా నేనా అనే రేంజ్ లో మాటలు వదులుకున్నారు. ఆ తర్వాత ఆ ఎలెక్షన్లలో విష్ణు విజయం సాధించడం..ఆ ఆతర్వాత ప్రకాష్ సైలెంట్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ట్వీట్స్ తో మళ్ళేమైనా వార్ మొదలు అవుతుందో చూడాలి.
😂😂😂😂 Ok sivayyyyyaaaaa .. i have my perception .. you have yours … Noted #justasking https://t.co/MmGUiXv5mN
— Prakash Raj (@prakashraaj) September 21, 2024
Read Also : Atishi Swearing LIVE: అతిషి అనే నేను