Site icon HashtagU Telugu

Prakash Raj – PK: జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన ప్ర‌కాష్‌రాజ్‌

Prakash And Pawan Imresizer

Prakash And Pawan Imresizer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి 25న విడుదలై భారీ వసూళ్ళు సాధిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ, మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్స్ వద్ద తీవ్ర అడ్డంకి ఏర్పడింది.

అంతకు ముందున్న టికెట్ ధరలతోనే అమ్మాలని సినిమాపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యేనని జగన్ రెడ్డి సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ వైఖరిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమమైన ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటో చూద్దాం :

‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా… ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అంటూ జగన్ సర్కార్ వైఖరిపై మండిపడ్డారు ప్రకాష్ రాజ్.

ఇలా ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై స్పందించిన రెండవ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే. ఇంతకు ముందు ఇదే విషయమై పవన్ కళ్యాణ్ చిన్న అన్నయ్య నాగబాబు కూడా తనదైన శైలిలో జగన్ సర్కార్ పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజు ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.