పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ పంచులు, సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ చేసే ట్వీట్స్ చూసి మెగా అభిమానులు , జనసేనా శ్రేణులు ఆగ్రహం తో రగిలిపోతుంటే..పవన్ మాత్రం ప్రకాష్ రాజ్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పడం ఆశ్చర్యం వేస్తుంది. తిరుమల లడ్డు (Tirumala Laddu) ఫై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్ ఫై పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫై ట్వీట్ చేస్తూ వస్తున్నారు.
మొదటి ట్వీట్ : ‘నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ పవన్ కళ్యాణ్. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు. ప్రస్తుతం తాను.. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని .. ఈనెల చివరను 30 తారీఖున వరకు వస్తానని .. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని … ఇంతలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడు.
ఆ తర్వాత కార్తీ..పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పిన నేపథ్యంలో మరో ట్వీట్ చేసాడు. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందేనని నెటిజన్లు , అభిమానులు భావించారు. ఇప్పుడు మరో ట్వీట్ చేసాడు.
మూడో సారి ” గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్” అంటూ ట్వీట్ చేసాడు. ఇలా వరుస ట్వీట్స్ చేస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగానే వివాదం జోలికి పోకుండా.. వ్యక్తిగతంగా ప్రకాశ్‌రాజ్ అంటే నాకు చాలా ఇష్టమని.. నాకు మంచి స్నేహితుడు కూడా. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. నటుడిగా ఆయన్ని గౌరవిస్తా. ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఇష్టం. అయితే తిరుమల లడ్డూ విషయంలో ప్రకాశ్ రాజ్ స్పందిచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా (దిల్లీలో మీ స్నేహితులంటూ) ఆయన ఆవిధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టా. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది అంటూ పవన్ చెప్పుకోచ్చాడు.
ఈ కామెంట్స్ కు కూడా ప్రకాష్ ట్వీట్ చేసాడు. ఈసారి ట్వీట్ లో… మనకేం కావాలి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించాలా? లేదంటే ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా? అంటూ ప్రశ్నించి జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ షేర్ చేశారు. పవన్ లాగడం ఎందుకు అని అంటుంటే..ప్రకాష్ మాత్రం లాగే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క ప్రకాష్ రాజ్ తీరు పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెక్యులరిస్టుగా చెప్పుకునే ప్రకాశ్ రాజ్ మత సమస్యలపై కాకుండా కేవలం హిందూ ధర్మంపైనే సులభంగా మాట్లాడతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇతర మతాలపై మాత్రం ఆయన మాట్లాడరు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారు. మరోవైపు తాను బీజేపీ విధానాలను విమర్శిస్తే తనను హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేస్తారని ప్రకాశ్ రాజు అంటుంటారు. తనకేమాత్రం సంబంధం లేని పవన్, కార్తీ ముచ్చట్లలోకి ప్రకాశ్ రాజ్ అనవసరంగా తలదూర్చుతున్నాడని జనం అనుకుంటున్నారట.
Read Also : Tirumala Laddu Issue : వాడని నెయ్యిపై తప్పుడు ప్రచారం ఎందుకు..? – జగన్