కంచె తో తెలుగు తెరకు పరిచయమైనా ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)..ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) లో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. మొదట్లో నిండుతనంతో గ్లామర్ కు దూరంగా కనిపించిన ఈ బ్యూటీ..ప్రస్తుతం గ్లామర్ తెరను బయటకు తీసి చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ అబ్బా అనిపిస్తుంది.
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ
నటసింహం నందమూరి బాలకృష్ణతో “అఖండ” సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత “డాకూ మహారాజ్” సినిమాలో కూడా నటించి ప్రేక్షకుల అభినందనలు అందుకుంది. ఈ సినిమాల తర్వాత వరుస అవకాశాలు వస్తాయని ఊహించుకున్నా, ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా “అఖండ 2″(Akhanda 2)లో నటించబోతుందనే ప్రచారం ఉన్నా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. దీంతో సోషల్ మీడియా వేదిక ను నమ్ముకున్న ఈ బ్యూటీ.. తరచూ గ్లామర్ ఫోటోషూట్లతో తన అందచందాలను ప్రదర్శిస్తూ యూత్‌ను తనవైపు తిప్పుకుంటోంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటోకు భారీ స్థాయిలో లైకులు, షేర్‌లు, కామెంట్లు వస్తుండటం చూస్తే ఆమె క్రేజ్ ఏమంత స్థాయిలో ఉందో అర్థం అవుతోంది.
Akhil Wedding : అఖిల్ పెళ్లికి రండి..చంద్రబాబు కు నాగ్ ఆహ్వానం
తాజాగా షేర్ చేసిన ఫొటోలలో ప్రత్యేకంగా ఆమె థైస్ హైలైట్ చేస్తూ ఇచ్చిన స్టైలిష్ పోజులు కుర్రకారుకి నిద్రపట్టనివ్వని స్థాయిలో ఉన్నాయి. “ఈ యాంగిల్‌లో ప్రగ్యా ఇలా ఉందంటే ఇక కుర్రాళ్లు బ్రతకగలరా?”, “ఇలాంటి ఫోటోలు చూసి ఎలా ఆపుకోవాలి..ఎలా తట్టుకోవాలి అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా హవా ఏమాత్రం తగ్గలేదన్నది స్పష్టంగా చెప్పొచ్చు.