నందమూరి బాలకృష్ణ తో నటించే ఛాన్స్ వస్తే దాదాపు టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి వెళ్లినట్టే. సీనియర్ హీరోల సరసన నటించేందుకు హీరోయిన్స్ కొందరు ఆలోచిస్తారు కానీ కొంతమంది మాత్రం ఎలాంటి డౌట్లు లేకుండా చేస్తుంటారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్స్ తో నటిస్తే ఆ హీరోల ఫ్యాన్స్ కి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా వచ్చిన అవకాశాన్ని గ్రాబ్ చేసుకోవాలి.
ఐతే ఆల్రెడీ ఫేడవుట్ అయిన హీరోయిన్ కు ఈ ఛాన్స్ వస్తే ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. అమ్మడు అఖండ తో సూపర్ హిట్ కొట్టినా సరే ఆమెకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. Balakrishna అఖండ వచ్చి 3 ఏళ్లు అవుతుండగా మళ్లీ అఖండ 2 (Akhana 2) కోసం ఆమెనే సెలెక్ట్ చేశారు మేకర్స్.
అఖండ 2 తాండవం పాన్ ఇండియా లెవెల్ లో
అఖండ 2 సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈసారి అఖండ 2 తాండవం పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న అఖండ 2 తో అయినా ప్రగ్యా (Pragya Jaiswal ) తిరిగి ఫాం లోకి వస్తుందేమో చూడాలి.
అందం అభినయం రెండు ఉన్నా కూడా ప్రగ్యా జైశ్వాల్ కు ఎందుకో టాలీవుడ్ లో లక్ కలిసి రాలేదు. అయితే సినిమా ఛాన్స్ లు లేకపోయినా సరే అమ్మడు ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. అఖండ 2 కి అమ్మడికి ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు.
Also Read : Naga Chaitanya Thandel : తండేల్ రిలీజ్ క్లారిటీ ఎప్పుడు..?