అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) సినిమాల కన్నా బయట తన గ్లామర్ తో ఆడియన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సినిమాల్లో ఛాన్సులు లేకపోయినా సరే ప్రగ్యా జైశ్వాల్ మెరుపులు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. ఐతే ఆ సినిమా తర్వాత యువ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంది.
కెరీర్ లో అవకాశాలు వస్తున్నప్పుడే వాటి మీద ఫోకస్ పెట్టి మంచి కథలను ఎంపిక చేసుకోవాలి అలా చేయకుంటే మాత్రం కెరీర్ డైలమాలో పడుతుంది. సేం అలానే ప్రగ్యా కూడా ఏదో వచ్చిన ప్రతి సినిమాను చేస్తూ వచ్చింది కానీ తన మార్క్ చూపించలేకపోయింది. అందుకే ఆమె స్పెషల్ కాలేకపోయింది. ఐతే గ్లామర్ సైడ్ కూడా అమ్మడు పెద్దగా షో చేసింది లేదు.
తీరా ఇప్పుడు అవకాశాలు లేని టైం లో ప్రగ్యా మెరుపులు మెరిపిస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ (Pragya Jaiswal Photoshoot) ఆమెకు సోషల్ మీడియాలో మైలేజ్ వచ్చేలా చేస్తుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం బాలయ్యతో అఖండ సినిమా చేసిన ప్రగ్యా ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు. కానీ రెగ్యులర్ గా తన ఫోటో షూట్స్ తో నిత్య వార్తల్లో ఉంటుంది. సినిమాల విషయంలో ఎందుకు ఆమె వెనకబడింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అఖండ సూపర్ హిట్ అయినా ప్రగ్యా (Pragya Jaiswal News)కి ఆఫర్లు రాలేదు. ఐతే మళ్లీ అఖండ 2 తో అమ్మడు ఛాన్స్ అందుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రయా మాత్రం సినిమా ఆఫర్లు పక్కన పెడితే ఫోటో షూట్స్ తో సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. ఏది ఏమైనా అమ్మడు అందమంతా అడివి కాచిన వెన్నెల అవుతుందని ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు.
Also Read : Kiran Abbavaram Ka Business : కిరణ్ అబ్బవరం లక్కు అలా ఉంది. ఒక రేంజ్ లో క బిజినెస్..!
