Pragathi : పవర్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన నటి ప్రగతి

Pragathi : టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేసిన ప్రగతి గారు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు.

Actress Pragathi Won Gold M

Actress Pragathi Won Gold M

టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేసిన ప్రగతి గారు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటారు. నటనతో పాటు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆమె, టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాల వివరాలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా సిల్వర్ మెడల్ సాధించగా, అత్యంత ముఖ్యమైన డెడ్ లిఫ్ట్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. బెంచ్ మరియు స్క్వాట్ లిఫ్టింగ్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్‌ను గెలుచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తూ, చీరకట్టులోనూ పవర్ లిఫ్టింగ్ చేసిన వీడియోలను షేర్ చేసి ఫిట్‌నెస్ విషయంలో స్ఫూర్తిగా నిలిచారు.

The Raja Saab : సంక్రాంతి బరిలో ‘ది రాజా సాబ్’ లేనట్లేనా..? నిర్మాత ఏమంటున్నాడంటే !!

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ఆమె, మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, తమిళ, మలయాళం, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌ మదిలో చెరగని ముద్ర వేశారు. ఆమె తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని నిరూపిస్తూ, గత రెండేళ్లలో అద్భుతమైన విజయాలను నమోదు చేశారు. 2023లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్స్ సాధించారు. అదే సంవత్సరం బెంచ్ ప్రెస్ విభాగంలోనూ డిస్ట్రిక్ట్, స్టేట్ మరియు నేషనల్ లెవెల్ (బెంగళూరు) పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి పవర్ లిఫ్టింగ్‌లో తన పట్టును నిరూపించుకున్నారు.

2024లో సౌత్ ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ప్రగతి, 2025లో తన విజయ పరంపరను మరింత పెంచారు. 2025లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో మళ్లీ గోల్డ్ మెడల్స్ సాధించి, కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇన్ని జాతీయ స్థాయి విజయాల తర్వాత, ఈ ఏడాది టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం నాలుగు పతకాలు (ఒక గోల్డ్, మూడు సిల్వర్) సాధించడం ఆమె పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనం. సిల్వర్ స్క్రీన్‌పై తల్లిగా, భార్యగా, సోదరిగా విభిన్న పాత్రల్లో మెప్పించిన ఈ సీనియర్ నటి, ఫిట్‌నెస్ రంగంలోనూ మెడల్స్ సాధిస్తూ, మహిళలకు మరియు సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిచారు.