Site icon HashtagU Telugu

Pradeep Ranganathan : నయనతార భర్తకి బర్త్‌డే రోజు ఈ హీరో ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూశారా?? నవ్వకుండా ఉండలేరు..

Pradeep Ranganathan gifted Dates to Director Vignesh Shivan Photos goes Viral

Pradeep Ranganathan gifted Dates to Director Vignesh Shivan Photos goes Viral

నయనతార(Nayanthara) భర్త, తమిళ్ పాపులర్ దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan) నిన్న సెప్టెంబర్ 18న తన పుట్టిన రోజు(Birth Day)ని సెలబ్రేట్ చేసుకున్నారు. నయనతార సోషల్ మీడియాలో కూడా వాళ్ళిద్దరి ఫోటోలు పోస్ట్ చేసి స్పెషల్ విషెష్ చెప్పింది. నయన్ విగ్నేష్ బర్త్ డేని బాగా సెలబ్రేట్ చేసింది. అయితే విగ్నేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి పలువురు తమిళ్ సినీ ప్రముఖులు కూడా వచ్చారు. నయన్ ఇంటి వద్దే ఈ సెలబ్రేషన్స్ జరిగినట్టు సమాచారం.

ఇటీవల లవ్ టుడే(Love Today) సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాధన్(Pradeep Ranganathan) కూడా విగ్నేష్ బర్త్ డేకి హాజరయ్యాడు. ప్రదీప్ లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. విగ్నేష్ బర్త్ డే కి వచ్చిన ప్రదీప్ స్పెషల్ గిఫ్ట్ తెచ్చాడు. అవేంటంటే డేట్స్(ఖర్జూరాలు). నిజంగానే ఒక ప్లేట్ లో ఖర్జూరాలు పెట్టి తీసుకొచ్చి విగ్నేష్ కి బర్త్ డే గిఫ్ట్ అని ఇచ్చాడు. ఒక ఖర్జూరని తినిపించాడు. దీంతో విగ్నేష్ కూడా ఆశ్చర్యపోయి నవ్వేశాడు.

అంతే కాకుండా ఆ ఖర్జూరాలని పట్టుకొని విగ్నేష్ తో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నేను మీ దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నారు. ఈ సంవత్సరం మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ డేట్స్ గిఫ్ట్ మీ కోసమే అని పోస్ట్ కూడా చేశాడు. అలాగే విగ్నేష్ కి డేట్స్ తినిపించిన వీడియో కూడా షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు, వీడియో వైరల్ గా మారాయి.

పుట్టిన రోజుకి ఇలా డేట్స్ ఎవరైనా గిఫ్ట్ ఇస్తారా, ప్రదీప్ సినిమాల్లోనే కాదు బయట కూడా నవ్విస్తాడు ఇలా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు.

 

Also Read : Sai Pallavi: నాగచైతన్య సరసన సాయిపల్లవి ఫిక్స్, అప్ డేట్ ఇదిగో!