టాలీవుడ్, కొలీవుడ్ లో ఒకప్పుడు హాట్ టాపిక్ గా మారిన లవ్ స్టోరీ అంటే ప్రభుదేవా – నయనతార (Prabhu Deva – Nayanthara) జోడీ. వీరి ప్రేమ సంబంధం 2009లో ‘విల్లు’ సినిమాతో మొదలై వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. ఆ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారు. ఆ బ్రేకప్‌కు గల అసలు కారణం ఆలస్యంగా బయట పడింది. టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నయన్‌ను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా కొన్ని షరతులు పెట్టాడట. వాటిలో ముఖ్యమైనది నయనతార తన నటనా కెరీర్‌ను వదిలేయాలన్న డిమాండ్.
Pawan Kalyan : హిందీపై మాట మార్చిన పవన్ కళ్యాణ్.. రాజకీయ ఒత్తిడే కారణమా..?
నటిగా టాప్‌లో ఉన్న సమయంలో కెరీర్‌ను మానేయాలన్న కండిషన్ నయన్‌కు కోపం వచ్చిందట. ఆమె ఇప్పటికే ప్రభుదేవా కోరిక మేరకు హిందూ మతంలోకి మారడమే కాకుండా, ఆయనకు ఉన్న పిల్లలను కూడా అంగీకరించింది. కానీ నటనను మానేయాలన్న విషయంలో మాత్రం ఆమె ఒప్పుకోలేదు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి చివరకు బ్రేకప్‌కు దారి తీసింది. బ్రేకప్ తర్వాత నయనతార కొంతకాలం తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ, తిరిగి తనను తాను మోటివేట్ చేసుకొని కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది. ఇది ఆమెను మరింత బలంగా మార్చింది.
ప్రభుదేవా ముందు నయన్ నటుడు శింబుతో ప్రేమలో ఉండేది. కానీ వారి మధ్య వచ్చిన వివాదాల వల్ల ఆ సంబంధం ముగిసింది. అనంతరం ప్రభుదేవాతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం సీక్రెట్‌గా ప్రేమను కొనసాగించిన నయన్-ప్రభు జంట, చివరికి విడిపోయింది. ఈ అనుభవం నయనతారను జీవితంలో చాలా పాఠాలు నేర్పించిందని ఆమె చాలాసార్లు చెప్పింది. ప్రస్తుతం నయన్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకొని, ఇద్దరు కవల పిల్లలతో కుటుంబ జీవితం హ్యాపీగా సాగిస్తూ, సినిమాల్లో కూడా బిజీగా ఉంది. ఇక ప్రభుదేవా కూడా డాక్టర్ హిమానీ సింగ్‌ను పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా ఇద్దరూ విడిపోయినా, తమదైన మార్గాల్లో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.