సినీ నటుడు ప్రభు(Actor Prabhu)కు ఇటీవల చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) నిర్వహించారు. ఆయన PRO తెలిపిన దాని ప్రకారం.. ప్రస్తుతం ప్రభు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో కోలుకుంటున్నారు. జ్వరం మరియు తీవ్ర తలనొప్పులతో బాధపడుతున్న ప్రభు ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు చేసిన పరీక్షల ద్వారా ప్రభు మెదడులో ఒక ప్రధాన రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. ఇది సర్వసాధారణమైన సమస్య కాదని, మెదడు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయించారు. ఈ శస్త్రచికిత్స మైనర్‌గా జరుగగా, ప్రభు ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పుకొచ్చాడు.
తమిళం, తెలుగు, హిందీ, మలయాళం వంటి వివిధ భాషల్లో ప్రభు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో హీరోగా కనిపించారు. తొలి సినిమాతోనే నటనపరంగా మెప్పించారు ప్రభు. ప్రస్తుతం సహయ నటుడిగా కనిపిస్తున్నారు. తెలుగులోనూ అనేక చిత్రాల్లో కనిపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో హీరో తండ్రిగా ప్రభు నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనూ కనిపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి సమాచారం బయటకు రావడంతో, అభిమానులు ఆయన త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నారు.
Read Also : Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు