Site icon HashtagU Telugu

Prabhu deva – Kajol : 27ఏళ్ళ తరువాత మళ్ళీ కలిసి నటించబోతున్న ప్రభుదేవా, కాజోల్..

Prabhu Deva Kajol Were Re Unite For A New Movie With Charantej Uppalapati

Prabhu Deva Kajol Were Re Unite For A New Movie With Charantej Uppalapati

Prabhu deva – Kajol : బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. 27ఏళ్ళ క్రిందట 1997లో ‘మెరుపు కలలు’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలోని ‘వెన్నెల‌వే వెన్నెల‌వే’ పాట.. ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాటలో ప్రభుదేవా, కాజోల్ వేసిన డాన్స్.. ఆడియన్స్ ని ఒక ట్రాన్స్ లోకి తీసుకు వెళ్తుంది. అయితే ఆ సినిమా తరువాత ప్రభుదేవా, కాజోల్ కలిసి మళ్ళీ నటించలేదు.

ఇన్నాళ్లు తరువాత ఇప్పుడు వెండితెర పై మళ్ళీ ఆ జంట కనిపించబోతుందట. ఇక ఈ సినిమాని తెలుగు దర్శకుడు తెరకెక్కించబోతున్నారట. నిఖిల్ తో ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారట. ఇటీవలే కాజోల్ ని కలిసి కథ వినిపించగా.. ఆమె వెంటనే ఓకే చెప్పేశారట. ఈ సినిమాలో కాజోల్ అండ్ ప్రభుదేవాతో పాటు న‌సీరుద్దీన్ షా, సంయుక్త మీన‌న్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా గురించి ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని, ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని చెబుతున్నారు. త్వరలోనే ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేసి.. మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. ఈ సినిమాని కూడా చరణ్ తేజ్.. యాక్షన్ థ్రిల్లర్ గానే ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారట.

కాగా 27ఏళ్ళ తరువాత కాజోల్ అండ్ ప్రభుదేవాని మళ్ళీ ఒక ఫ్రేమ్ లోకి తీసుకు వస్తుండడంతో.. ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. మరి ఆ హిట్ పెయిర్.. ఇప్పుడు ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.