Site icon HashtagU Telugu

Salaar: ప్రభాస్ సలార్‌ బాక్సాఫీస్‌ వద్ద సెగలు రేపింది: చిరంజీవి

Prabhas And Chiru

Prabhas And Chiru

Salaar: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ వచ్చింది. మొదటి రోజే 60 కోట్లు వసూలు చేసిందని టాక్. ఇక ప్రభాస్ నటనను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే సినిమాపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సలార్‌ సెగలు పుట్టిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ సలార్‌ సినిమా గురించి మెగాస్టార్ ఎక్స్‌ (ట్విట్టర్‌)వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సలార్‌ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ట్వీట్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ‘మైడియర్ దేవా ప్రభాస్‌కు హార్దిక అభినందనలు. సలార్‌ బాక్సాఫీస్‌ వద్ద సెగలు రేపింది. అద్భుత విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్‌కు అభినందనలు, ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారు. పృథ్వి, శృతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్‌ భువన్‌ గౌడ్, రవి బస్రూర్‌, వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్‌కు అభినందనలు’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది శృతిహాస‌న్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2023లోనే మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆకట్టుకుంది.