“రాధే శ్యామ్” అనే పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ఫలితంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. అభిమానులు ఉత్సాహపరిచేందుకు ప్రభాస్ తన తదుపరి సినిమాపై ఫోకస్ చేశాడు. పౌరాణిక చిత్రమైన ‘ఆదిపురుష్’ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అత్యాధునిక సాంకేతికత విలువలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తో ప్రభాస్ అభిమానులను సంతోషపర్చాలని మేకర్స్ భావిస్తున్నారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఈ మూవీ జనవరి 2023లో థియేటర్లలోకి రానుంది.