Site icon HashtagU Telugu

Vijay-Prabhas: విజయ్ దేవరకొండ కి స్పెషల్ విషెస్ తెలిపిన ప్రభాస్.. పోస్ట్ వైరల్!

Vijay Prabhas

Vijay Prabhas

టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ గా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందంతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ విషెస్ తెలుపుతున్నారు. అందులో భాగంగానే తాజాగా డార్లింగ్ ప్రభాస్ కూడా హీరో విజయ్ దేవరకొండకు విషెస్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు పోస్టులు కూడా చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే ఆ పోస్టులు తనకి సంబంధించినవి కాకుండా ఇతర హీరోలు, ఇతర సినిమాలకు సంబంధించిన పోస్టులు కావడం విశేషం. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారు ప్రభాస్. రేపు రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దిల్ రాజు గారికి నా విషెస్ తెలియజేస్తున్నాను అంటూ ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు వేశారు.

Also Read: Anupama Parameswaran: తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన అనుపమ.. అత్తయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

ఇక ఈ పోస్టుకి విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. ఐ లవ్ యు ప్రభాస్ అన్న అంటూ పోస్టు వేశారు. ప్రస్తుతం స్టోరీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

Vijay Deverakonda Prabhas

ప్రస్తుతం ఈ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ఈ సినిమాలలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న తమన్నా సూపర్ హిట్ మూవీ.. అదేంటంటే?