Site icon HashtagU Telugu

Prabhas : నీటిపై ముగ్గుతో ప్రభాస్ ఫోటో వేసిన అభిమానం చాటుకున్న యువతీ..

Water Prabhas

Water Prabhas

సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో వీరాభిమానులు ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనే రేంజ్లో ఉంటారు. హీరోల పుట్టిన రోజులు వచ్చిన , సినిమాలు వచ్చిన పెద్ద పండగల భావిస్తారు..భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం , రక్తదానాలు , పాలాభిషేకాలు చేస్తూ తమ అబిమానం చాటుకుంటుంటారు.

మరికొంతమంది తమ అభిమాన హీరోల చిత్రపటాలు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పెన్సిల్, నాలికతో, ఆకుపై చిత్రాలను గీయడం ఇలా ఎన్నో చేస్తుంటారు. కానీ ఓ మహిళా అభిమాని ఓ ప్లేట్లో నీటిని ఉంచి.. దానిపై రంగవల్లులతో ‘సలార్’ సినిమాలోని ప్రభాస్ (Prabhas) లుక్ వేసి ఔరా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఆమెను అభినందిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బాహుబలి చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్ వంటి చిత్రాల్లో నటించగా..తాజాగా సలార్ తో భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్లో , నాగ్ అశ్విన్ డైరెక్షన్లో కల్కి మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా చాల డిఫరెంట్ మూవీస్..మరి ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

Read Also : Google Free Courses : గూగుల్ ఉచిత ఏఐ కోర్సులతో ఉద్యోగానికి బాటలు