Site icon HashtagU Telugu

Prabhas : ఇది కదా రెబల్ మాస్ మేనియా.. ప్రభాస్ 10 సినిమాల లైనప్ ఇదే..!

PrabhasXHombale3movies Prabhas Hombale 3 Movies Agreement

PrabhasXHombale3movies Prabhas Hombale 3 Movies Agreement

Prabhas టాలీవుడ్ లో ఏ హీరో లేని ఫాం లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్న ప్రభాస్ సెట్స్ మీదనే కల్కి, రాజా సాబ్ సినిమాలు ఉన్నాయి. కల్కి ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతుందని తెలుస్తుండగా రాజా సాబ్ ఈ ఇయర్ ఎండింగ్ కానీ 2025 సంక్రాంతికి కానీ వస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ రెండిటి తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ చేస్తాడని తెలిసిందే. ఈ మూవీ తర్వాత హను రాఘవపుడితో సినిమా ఉంటుందని అంటున్నారు. తెలుగు డైరెక్టర్స్ తో పాటుగా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఇక మరోపక్క బోయపాటి శ్రీను, రాజమౌళి కూడా ప్రభాస్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. మరో పక్క సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ఉన్నాయి. సో ఎలా లేదన్నా ప్రభాస్ 10 సినిమాల దాకా లైనప్ అంతా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ లైనప్ చేస్తే మాత్రం ప్రభాస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పటివరకు పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతుండగా ఇక మీదట పాన్ వరల్డ్ రిలీజ్ అవుతాయని తెలుస్తుంది.