Site icon HashtagU Telugu

Prabhas: ప్రభాస్ విగ్రహంపై విమర్శలు.. ఇలా తయారు చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఫైర్

Prabhas

Prabhas

మైసూర్‌లోని ఒక మ్యూజియంలో ప్రభాస్ ఇటీవల ఆవిష్కరించిన మైనపు విగ్రహం ‘రెబల్ స్టార్’ని పోలి లేకపోవడంతో అతని అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చాలా మంది నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఐకానిక్ బాహుబలి వేషధారణలో ఉన్న ప్రభాస్‌ విగ్రహాన్ని తొలగించాలని అధికారులను కోరుతున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాత శోబు యార్లగడ్డ ఈ విషయమై రియాక్ట్ అయ్యారు.

బాహుబలి పాత్రలు, కథనం మరియు ఇతర అంశాలకు సంబంధించిన అన్ని హక్కులు తన నియంత్రణలో ఉన్నాయని, ఫ్రాంచైజీకి సంబంధించిన ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు తమ ఆధీనంలో ఉన్నాయన్నారు. బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కలిగి ఉండటం గమనించదగ్గ విషయం, అలాంటి గౌరవం పొందిన మొదటి దక్షిణ భారత నటుడుగా ప్రభాస్ నిలవడం గర్వకారణం. ఇప్పుడు మైసూర్‌లో ప్రభాస్ మైనపు విగ్రహం సరైన విధంగా లేకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ  వివాదంపై శోబు యార్లగడ్డ ఏవిధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: YS Sharmila: రాజకీయ చదరంగంలో షర్మిల.. విలీనంపై నో క్లారిటీ!