Prabhas Sreenu: ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే, నటి తులసితో రిలేషన్ పై ప్రభాస్ శ్రీను రియాక్షన్

నటుడు ప్రభాస్ శ్రీను, సీనియర్ నటి తులసి మధ్య రిలేషన్ ఉందని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Prabhas Sreenu

Prabhas Sreenu

టాలీవుడ్ లో రూమర్స్ (Rumours) వినిపించడం కొత్తేమీ కాదు. ప్రతి సినిమాకే ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటుంది. పలానా స్టార్ హీరోకు, ఓ యంగ్ హీరోయిన్ తో రిలేషన్ ఉందనీ, అందుకే హీరోయిన్ కు ఆఫర్స్ ఇస్తున్నాడనే పుకార్లు వినిపించడం ఇండస్ట్రీలో కామన్ గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు ప్రభాస్ శీను సీనియర్ నటి తులసితో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ శీను సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా. శీను దాదాపు 300 సినిమాల్లో విలన్, హాస్యనటుడు, స్నేహితుడు క్యారెక్టర్ యాక్టర్ వంటి విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ప్రభాస్ శీనుకు పెళ్లై ఒక కూతురు కూడా ఉంది. అయితే “శంకరాభరణం” ఫేమ్‌ సీనియర్ నటి తులసితో రిలేషన్ (Relationship) కొనసాగిస్తున్నాడని పలు వెబ్ సైట్స్ లో వార్తలొచ్చాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి.

దీంతో ప్రభాస్ శీను ఓ టాక్ షోలో తులసితో కలిసి కనిపించాడు. తనపై వస్తున్న పుకార్లపై రియాక్ట్ అయ్యాడు. తులసి తనకు అత్త లేదా తల్లి లాంటిదని, పుకార్లను పట్టించుకోవద్దని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ (Family Friend) అని తేల్చిచెప్పాడు. తులసి బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె ప్రస్తుతం పలు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కు మదర్ క్యారెక్టర్లలో కనిపిస్తోంది.

Also Read: Team India: ఐపీఎల్ ఎఫెక్ట్.. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫిని కొట్టలేని టీమిండియా!

  Last Updated: 13 Jun 2023, 12:04 PM IST