Trisha సౌత్ లో ఇప్పటికీ తన దూకుడు చూపిస్తున్న త్రిష కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్ధాలు అవుతున్నా కూడా అసలేమాత్రం వెనక్కి తగ్గట్లేదు అనిపిస్తుంది. మధ్యలో కొన్నాళ్లు కెరీర్ లో వెనకపడిన అమ్మడు 96 సినిమాతో తిరిగి ఫాం లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి త్రిష తిరిగి చూసుకోలేదు. గత రెండు మూడేళ్లలో పి.ఎస్ 1 అండ్ 2, లియో సినిమాలతో అమ్మడు ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు అజిత్, విజయ్ సినిమాల్లో నటించింది.
ఐతే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ త్రిష టాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. అమ్మడు లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న విశ్వంభర (Viswambhara) సినిమాలో నటిస్తుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రాబోతుంది. ఇక ఈ సినిమా పూర్తి కాకుండానే అమ్మడు మరో ఛాన్స్ అందుకుందని టాక్.
Also Read : NTR : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారా..?
ఈసారి ఏకంగా ప్రభాస్ తో త్రిష ఛాన్స్ పట్టేసినట్టు తెలుస్తుంది. త్రిషతో ప్రభాస్ (Prabhas) ఆల్రెడీ వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు చేసింది. వాళ్లిద్దరు కలిసి నటించారు అంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అన్నట్టే ఉంటుంది. ప్రభాస్ తో మరోసారి త్రిష జత కడుతుంది. సందీప్ వంగ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ గా లాక్ అయినట్తు టాక్.
ఆఫ్టర్ గ్యాప్ తెలుగు ఆఫర్ అందుకున్న త్రిష ఇప్పుడు ఇక్కడ కూడా వరుస క్రేజీ ఛాన్సులు పట్టేస్తుంది. త్రిష ప్రభాస్ కాంబో కన్ఫర్మ్ అయితే మాత్రం మరో 10 ఏళ్లు త్రిషకు తిరుగు ఉండదని చెప్పొచ్చు. మరి ఈ ఛాన్సులను త్రిష ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అన్నది ఆ సినిమాలు వస్తేనే కానీ చెప్పగలం.