పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్లో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. ఈ సినిమా ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి తో తన టాలెంట్ ఏంటో చూపించిన సందీప్..ఈ మధ్య యానిమల్ తో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు పాన్ ఇండియా స్థాయి లో తన సత్తా చాటుకున్నాడు. అలాంటి సందీప్..ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిన దగ్గరి నుండి ఈ సినిమా ఫై ఆసక్తి పెరుగుతూ వస్తుంది.
తాజాగా ఈ మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ లో ‘ప్రభాస్ పోలీసు పాత్రలో నటిస్తారని, కానీ కథలో మలుపుల కారణంగా ఆయన గ్యాంగ్ స్టార్ గా మారుతారు. భారీ వైల్డ్ ఎలిమెంట్స్ మూవీకి హైలైట్గా నిలుస్తాయి’ అని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తతం మాత్రం ఇది తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు ప్రత్యేకమైన స్టార్స్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఫిక్స్ చేశారట. ఆ ఇద్దరూ మరెవ్వరో కాదు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), యానిమల్ ఫేమ్ రణబీర్ కపూర్ (Ranabir Kapoor). ఈ ఇద్దరికి సూపర్ హిట్‌లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో వారిని నటింపజేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ ఇద్దరికీ వారి పాత్ర తాలూకా సీన్లను వినిపించగా..వారు ఓకే చెప్పారని తెలుస్తుంది. అలాగే ఓ స్టార్ హీరోను ఈ చిత్రంలో విలన్ గా తీసుకోవాలని సందీప్ ప్రయత్నిస్తున్నట్లు టాక్.
Read Also : Harish Rao : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం..పోలీసులకు హరీశ్ వార్నింగ్..!