Site icon HashtagU Telugu

Prabhas Spirit : స్పిరిట్ కోసం కొరియన్ స్టార్.. సందీప్ ప్లానింగ్ వేరే లెవెల్..!

Prabhas Spirit Sandeep Vanga Next Level Planing

Prabhas Spirit Sandeep Vanga Next Level Planing

కల్కితో సెన్సేషనల్ హిట్ అందుకుని మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా 1000 కోట్లని ప్రూవ్ చేసిన ప్రభాస్ (Prabhas) తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ లో కూడా అదరగొడుతున్నాడు. కల్కి 1 తర్వాత ప్రస్తుతం మారుతితో చేస్తున్న రాజా సాబ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. థ్రిల్లర్ జోనార్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ (Raja Saab) సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి హీరోతో సినిమా పడటం లక్కీ అని చెప్పొచ్చు. కల్కి జోష్ లో రాజా సాబ్ ఏ కొద్దిగా వర్క్ అవుట్ అయినా మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క. ఇదిలాఉంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమా సందీప్ వంగ డైరెక్షన్ లో చేయనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ 3 సినిమాలతోనే తన డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది చూపించాడు సందీప్ రెడ్డి వంగ.

ఇప్పుడు ప్రభాస్ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. స్పిరిట్ (Spirit) టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం విలన్ గా ఏకంగా సౌత్ కొరియన్ యాక్టర్ ని దించుతున్నాడు సందీప్ వంగ. సౌత్ కొరియాలో (South Korean Actor) బిజీ ఆర్టిస్ట్ అయిన మా డాంగ్ సియోక్ (Madong Seok) ని స్పిరిట్ కోసం సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ (PAN World) సినిమా అన్నట్టే లెక్క. అందుకే సందీప్ వంగ ప్రభాస్ తో హాలీవుడ్ (Hollywood) రేంజ్ ట్రీట్ మెంట్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కోసం కొరియన్ యాక్టర్ ని తీసుకోవడం లో రీజన్ కూడా అదే అంటున్నారు. సో సందీప్ వంగ యానిమల్ కాదు దానికి డబుల్ రేంజ్ లో స్పిరిట్ చేస్తాడని చెప్పొచ్చు. ఈ సినిమా బడ్జెట్ ఎంత ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది.. రిలీజ్ ఎప్పుడు లాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.