Site icon HashtagU Telugu

Prabhas : కర్ణాటక గుడిలో ప్రభాస్.. ప్రత్యేక పూజలు..!

Prabhas Special Pooja In Mangaluru Temple

Prabhas Special Pooja In Mangaluru Temple

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రీసెంట్ గా సలార్ 1 సీజ్ ఫైర్ తో సత్తా చాటాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రెబల్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ప్రభాస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ నిర్మించారు. సినిమా రిలీజై సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ తర్వాత మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

We’re now on WhatsApp : Click to Join

హోంబలే బ్యానర్ నిర్మాత విజయ్ ప్రభాస్ తో పాటు పూజలో పాల్గొన్నారు. ప్రభాస్ సలార్ 1 రిలీజై 20 రోజులు అవుతుంది. కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో ఈ సినిమాని పోల్చడం కష్టం కానీ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని అనుకున్న రేంజ్ లో చూపించడం లోస సక్సెస్ అయ్యాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

సినిమాలో దీపికా పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేశారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న కల్కి సినిమాపై కూడా తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడి సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ ప్రియులకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.

కల్కి తర్వాత మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అంటూ వస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ ఇయర్ సమ్మర్ కి కల్కి వస్తుండగా ఇయర్ ఎండింగ్ కి రాజా సాబ్ వచ్చేలా ఉన్నాడు. సో ఏడాది లో సలార్ 1, కల్కి, రాజా సాబ్ 3 సినిమాలతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని అలరించడానికి సిద్ధమయ్యాడు ప్రభాస్. తప్పకుండా ప్రభాస్ రేంజ్ పెంచే సినిమాగా కల్కి, రాజా సాబ్ ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Also Read : Hanuman : హనుమాన్ హిట్ టాక్ తో ఆ డైరెక్టర్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ప్రస్తుతం ప్రభాస్ మంగళూరు టెంపుల్ లో కనిపించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో తప్ప బయట ఎక్కువ కనిపించని ప్రభాస్ ఈమధ్య సలార్ 1 కోసం ఒక ఇంటర్వ్యూ తప్ప అస్సలు కనిపించలేదు. ఈ ఇయర్ మరోసారి ప్రభాస్ తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Exit mobile version