పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ (Rajasaab)పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మారుతి (Maruthi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదట్లో మాత్రం అభిమానుల్లో ఓ అనుమానాన్ని కలిగించింది. మారుతి గత సినిమాలు సక్సెస్ కాకపోవడం, అలాగే ప్రభాస్ లాంటి స్టార్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడోననే సందేహాలు రేకెత్తించాయి. అయితే షూటింగ్ నుండి లీకైన ఫోటోలు, అనంతరం వచ్చిన గ్లింప్స్ వీడియో మాత్రం ఈ అనుమానాలను పటాపంచలు చేసి, ఫ్యాన్స్‌కి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రభాస్ స్టైలిష్ మేకోవర్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంది.
TDP National President : టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
గతంలో మారుతి సినిమాలపై నెగటివ్ టాక్ ఉన్నా, రాజాసాబ్ గ్లింప్స్ విడుదలైన వెంటనే అభిమానుల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. “జై మారుతి” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదట ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ ఆగస్టు 15కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఇప్పుడు అలా చేస్తే సమ్మర్ హంగామా కాకపోయినా, ఇండిపెండెన్స్ డే ట్రీట్ గ్యారంటీ అంటున్నారు.
ఇక తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా థియేటర్లలో రాజాసాబ్ టీజర్‌ను ప్రీమియర్ చేయనున్నట్లు సమాచారం. ఇది నిజమే అయితే, పవన్ + ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది వన్ ప్లస్ వన్ బోనస్. దీంతో థియేటర్లలో మాస్ ఫెస్టివల్ గ్యారంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఈ సినిమాలో హార్రర్ సీన్లు ప్రపంచ సినిమా స్థాయిలో ఉండబోతున్నాయని, ఇంతవరకూ ఎక్కడా చూడని భయానక అనుభూతి రాబోతుందని నిర్మాత విశ్వ ప్రసాద్ ఇటీవల పేర్కొన్నారు.