Site icon HashtagU Telugu

Prabhas : ‘డబల్ ఇస్మార్ట్‌’లోని అలీ పాత్ర ‘బిల్లా’ సమయంలో పుట్టిందా.. గంటన్నర నవ్విన ప్రభాస్..

Prabhas, Ali, Double Ismart

Prabhas, Ali, Double Ismart

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో చాలా రెబల్ గా కనిపిస్తుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ఆయన ఒక చంటి పిల్లాడిలా కనిపిస్తుంటారు. అల్లరి చేస్తూ ఒక పిల్లాడి కనిపిస్తారు. అలాగే ఇతరులు చేసే అల్లరిని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఈక్రమంలోనే ‘బిల్లా’ సినిమా షూటింగ్ సమయంలో అలీ చేసిన ఒక పనికి గంటన్నర పాటు నవ్వుకున్నారట. అప్పుడు అలీ చేసిన ఆ అల్లరినే ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ లో ఒక ఫన్నీ పాత్రగా చూపించబోతున్నారు పూరీజగన్నాధ్. ఈ విషయాన్ని అలీ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ వారం రిలీజ్ కి సిద్దమవుతున్న డబల్ ఇస్మార్ట్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ లో డిఫరెంట్ గా కనిపించిన అలీ పాత్ర అందర్నీ ఆకట్టుకుంది. పూరీజగన్నాధ్ సినిమాల్లో అలీ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటూ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక డబల్ ఇస్మార్ట్ లో అలీ పాత్ర మరింత డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈసారి వేషధారణ, బాడీ లాంగ్వేజ్ తో పాటు మాట్లాడే బాషా కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. అసలు ఈ పాత్ర ఎలా పుట్టింది అని అలీని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశించారు.

దానికి అలీ బదులిస్తూ.. “మలేసియాలో బిల్లా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. జనరల్ గా మనకి మేనేజర్స్ అంటే మనుషులే ఉంటారు. అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ప్రభాస్ వాళ్ళకి చేసి చూపించాను. అది చూసిన ప్రభాస్ కిందపడిపోయి నవ్వుకున్నాడు. నేను జోక్ చెప్పేసి, రూమ్ కి వెళ్ళిపోయాను. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. అలా గంటన్నర పాటు ప్రభాస్ ఆ జోక్ కి నవ్వుకున్నాడు. ఇక అది చూసిన నేను.. పూరికి ఫోన్ చేసి ఆ చింపాంజీ పాత్ర గురించి చెప్పను. అలా ఆ పాత్ర పుట్టుకొచ్చింది” అంటూ వెల్లడించారు.

Exit mobile version