Site icon HashtagU Telugu

Kalki 2898 AD : ‘కల్కి’తో ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏంటో తెలుసా..?

Prabhas, Kalki 2898 Ad, Bookmyshow

Prabhas, Kalki 2898 Ad, Bookmyshow

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ కి సరికొత్త రికార్డులు సృష్టించడం ఒక అలవాటుగా మారిపోయింది. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డుల పరంపర.. కొత్త సినిమాలతో ముందుకు సాగుతూనే వెళ్తుంది. ఇక తాజాగా రిలీజైన కల్కి సినిమాతో ప్రభాస్ మరికొన్ని రికార్డులు సృష్టిస్తున్నారు. కలెక్షన్స్ పరంగా వెయ్యికోట్ల మార్క్ ని క్రాస్ చేసి.. వెయ్యికోట్ల క్లబ్ రెండు సినిమాలు ఉన్న ఏకైక సౌత్ హీరోగా నిలిచారు. అంతేకాదు ఏరియాల పరంగా కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు.

ఇక తాజాగా సృష్టించిన రికార్డు ఏంటంటే.. ఆన్‌లైన్ మూవీ టికెట్స్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ సేల్ జరిగింది. కల్కి రిలీజై ఆల్మోస్ట్ మూడు వారాలు అవుతుంది. అయినాసరి థియేటర్స్ లో హౌస్ ఫుల్ షోలు పడుతూనే ఉన్నాయి. ఈక్రమంలోనే సినిమా విడుదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు తెగిన టికెట్స్‌తో.. బుక్ మై షోలో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఈ టికెట్స్ సేల్ కి సంబంధించిన వివరాలకు మూవీ టీం రిలీజ్ చేసింది.

జూన్ 23న బుక్ మై షోలో ఈ మూవీ టికెట్స్ ని ఓపెన్ చేసారు. అప్పటినుంచి ఇప్పటివరకు 12.15M టికెట్స్ అమ్ముడుపోయాయి. అంటే 1 కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ అమ్ముడయ్యాయి. బుక్ మై షోలో కేవలం ఒక సినిమాకి ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడు అవ్వడం ఇదే మొదటిసారి. కాగా కేవలం బుక్ మై షోలోనే ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోయాయంటే.. ఇక మిగిలిన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లను కూడా కలుపుకుంటే ఇంకెన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి అనే ఆలోచనే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ రేంజ్ టికెట్ బుకింగ్స్ బాలీవుడ్ బడా హీరోలు కూడా చూడలేదు. అలాంటిది ప్రభాస్ చూపిస్తూ కొత్త రికార్డులను సెట్ చేసారు.