Prabhas Sandeep Vanga రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ 1, కల్కి, మారుతి డైరెక్షన్ లో సినిమా 3 సెట్స్ మీద ఉన్నాయి. సలార్ 1 ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 22న రిలీజ్ లాక్ చేశారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కు ప్రభాస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత 2024 మే 9న కల్కి (Kalki) రిలీజ్ చేస్తారని టాక్. ఆ సినిమా షూటింగ్ డిసెంబర్ కల్లా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఆ నాలుగు నెలలు చేయాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాల తర్వాత ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. యానిమల్ తర్వాత ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ చేస్తున్నాడు సందీప్ వంగ. అయితే ఈ సినిమాకు ప్రభాస్ 2024 మార్చి నుంచి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. స్పిరిట్ సినిమా కు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేయగా ప్రభాస్ తో వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నారట.
అది పూర్తైతే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. సినిమా కోసం సందీప్ వంగా (Sandeep Vanga) ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తుంది. యానిమల్ హిట్ అయితే ప్రభాస్ తో చేస్తున్న సందీప్ వంగా స్పిరిట్ కూడా నెక్స్ట్ లెవెల్ అంచనాలతో వస్తుందని చెప్పొచ్చు.
Also Read : Prudhvi Raj : ఆ సినిమాలో రాముడి పాత్ర పృథ్వీరాజ్ చేయాలి.. కానీ..
We’re now on WhatsApp : Click to Join