ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న స్లార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ అనేది రాలేదు. అసలైతే సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అని అనౌన్స్ చేసినా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అవ్వకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. రెబల్ ఫ్యాన్స్ టార్గెట్ భరించలేక ప్రొడక్షన్ హౌస్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సలార్ పార్ట్ 1 అనుకున్న డేట్ మిస్ అవగా దీపావళికి వస్తుందని కొందరు అంటున్నారు. దివాళి మిస్ అయినా డిసెంబర్ సినిమాల రేసులో ఉంటుందని చెప్పుకుంటున్నారు.
ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఏకంగా 2024 సంక్రాంతికి సలార్ (Prabhas Salaar ) రిలీజ్ అంటున్నారు. ఆల్రెడీ పొంగల్ రేసులో ఖర్చీఫ్ వేసుకుని మరీ సినిమాలు ఉన్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం ముందు ఉంది. ప్రభాస్ కల్కి సినిమా కే సినిమా గుంటూరు కారం పోటీ అనుకున్నారు కానీ కల్కి సమ్మర్ కి షిఫ్ట్ అవగా మహేష్ మాత్రం పందెం లో ఉన్నాడు. సంక్రాంతి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ సీజన్ అవడంతో రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.
వీటితో పాటుగా కింగ్ నాగార్జున నా సామిరంగ కూడా సంక్రాంతి రిలీజ్ లాక్ చేశారు. ఒకవేళ ప్రభాస్ సలార్ సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమాల్లో కొన్ని రిలీజ్ వాయిదా వేసుకునే అవకాశం ఉంది. మహేష్ ఒక్కడు ఎవరొచ్చినా రాకపోయినా సంక్రాంతికి రిలీజ్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. సన్ర్కాంతి ఫైట్ లో ఫైనల్ రేసు ఎవరి మధ్య 2024 సంక్రాంతి సినిమాల సందడి ఎలా ఉంటుంది అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.
ప్రభాస్ వర్సెస్ మహేష్ మాత్రమే ఉంటే మాత్రం రెండు సినిమాలకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ప్రభాస్ సలార్ ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుండగా మహేష్ గుంటూరు కారం త్రివిక్రం స్టైల్ ఆఫ్ మేకింగ్ తో అదరగొట్టబోతుంది. మరి సలార్ (Prabhas Salaar ) గుంటూరు కారం మధ్య ఫైట్ ఎంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి.
Also Read : Rahul Sipligunj : రతికపై రాహుల్ కామెంట్.. సింపతీ గేమ్ ఎప్పటివరకు అంటూ..!