Site icon HashtagU Telugu

Prabhas : సలార్ ఐటం సాంగ్.. షూట్ చేసి ఎందుకు కట్ చేశారు..?

Prabhas Salaar Special Item Song Missing

Prabhas Salaar Special Item Song Missing

ప్రభాస్ (Prabhas) సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి అందరు డిస్కస్ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమాల్లో అలాంటి ఒక సాంగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కె.జి.ఎఫ్ 1, 2 భాగాల్లో కూడా తమన్నా, మౌనీ రాయ్ లతో ఐటం సాంగ్స్ ఆడియన్స్ ని అలరించాయి. ఇక అదేవిధంగా సలార్ 1 లో స్పెషల్ సాంగ్ ఉంటుందని అనుకున్నారు. కానీ అది లేకుండానే సినిమా పూర్తి చేశారు. సలార్ 1 కోసం సిమ్రత్ కౌర్ తో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాంగ్ షూట్ చేశారు. దాదాపు సాంగ్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. కానీ ఆ సాంగ్ ని సినిమాలో పొందుపరచలేదు.

అయితే ఆ సాంగ్ సలార్ 2లో ఉంటుందని కొందరు అంటున్నారు. సలార్ 1 కమర్షియల్ గా బంపర్ హిట్ అందుకుంది. సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి చాలాకాలం తర్వాత ఒక మంచి ఫుల్ మీల్స్ అందించేలా చేసింది. ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా సలార్ తెరకెక్కింది.

Also Read : Sradda Das ” శ్రద్ద దాస్ స్కిన్ షో కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ప్రభాస్ సలార్ 2 పార్ట్ కథ కూడా తెలిసిపోయింది. ఇద్దరు స్నేహితుల మధ్య యుద్ధమే సలార్ సినిమా సెకండ్ పార్ట్ కథ. మరి ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ ఎలా తీర్చిదిద్దుతాడు అన్నది చూడాలి. సలార్ 1 తో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. 3 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సలార్ సత్తా చాటుతున్నాడు.

సలార్ తర్వాత ప్రభాస్ కల్కి 2024 మే లో రిలీజ్ అవుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. దీపిక పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సినిమాలో ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join