Prabhas : సలార్ రిలీజ్ ట్రైలర్.. ఫ్యాన్స్ పేషెన్సీకి టెస్టింగ్..!

ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా

Published By: HashtagU Telugu Desk
First song released from Prabhas Prashanth Neel Salaar Part 1 Movie

First song released from Prabhas Prashanth Neel Salaar Part 1 Movie

ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ 1 సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సలార్ సినిమా రిలీజ్ ట్రైలర్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తారని అనౌన్స్ చేశారు. కానీ ఈరోజు ఉదయం కి అది వాయిదా వేశారు. ఉదయం 10:45కి సలార్ రిలీజ్ ట్రైలర్ వస్తుందని చెప్పారు. కానీ అది మళ్లీ వాయిదా పడింది.

ఈరోజు ఆఫ్టర్ నూన్ 2 గంటలకు సలార్ రిలీజ్ ట్రైలర్ రాబోతుంది. మరి ఈ ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ చేస్తున్న జాప్యానికి కారణం ఏంటో కానీ రిలీజ్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ పేషెన్సీకి టెస్ట్ పెట్టినట్టు అవుతుంది. ఇప్పటికే రిలీజైన సలార్ ట్రైలర్ అదుర్స్ అనిపించగా రిలీజ్ ట్రైలర్ లో ఇంకాస్త ఎక్కువ అంచనాలు పెంచుతారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

Also Read : Bigg Boss7 : మహేష్ రానన్నాడా.. బిగ్ బాస్ షోపై సెలబ్రిటీల అనాసక్తి ఎందుకు..?

కానీ నిన్న ఈనింగ్ నుంచి రిలీజ్ ట్రైలర్ విషయంలో లేట్ అవుతూ వస్తుంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ రెబల్ ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ ట్రైలర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాగా సలార్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. సినిమాలో ప్రభాస్ దేవ పాత్రలో నటిస్తుండగా వరదరాజ మన్నార్ గా పృధ్వి రాజ్ సుకుమారన్ నటించారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 18 Dec 2023, 11:02 AM IST