Prabhas Salaar : రెబల్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ 6 నెలలు వెనక్కి..!

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ 1 (Prabhas Salaar) సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకున్నారు. కానీ

Published By: HashtagU Telugu Desk
Salaar Movie Twitter Review

Prabhas Salaar Release In 2

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ 1 (Prabhas Salaar) సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా వయిదా వేశారు. అయితే దీపావళి, క్రిస్మస్ అంటూ లెక్కలేసుకుంటున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఒక న్యూస్ బయటకు వినిపిస్తుంది. సలార్ ని ఏకంగా ఆరు నెలలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని టాక్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కాకపోయినా సంక్రాంతి రేసులో అయినా సలార్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు.

కానీ సంక్రాంతికి ఆల్రెడీ రిలీజ్ లు కన్ఫర్మ్ అవడం థియేటర్లు కూడా సర్ధుబాట్లు జరగడం అయ్యింది. ఇప్పుడు సడెన్ గా ప్రభాస్ పొంగల్ రిలీజ్ అంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అందుకే అలా వద్దనుకుని సినిమాను మార్చిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మార్చి 22న సలార్ పార్ట్ 1 రిలీజ్ ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. అంటే సెప్టెంబర్ టు మార్చ్ అంటే దాదాపు ఆరు నెలలు అంటే ప్రభాస్ ఫ్యాన్స్ మరో ఆరు నెలలు సినిమా రిలీజ్ కోసం ఎదురుచూడాల్సిందే.

Prabhas Salaar సినిమా అవుట్ మీద దృష్టి పెట్టిన మేకర్స్ సినిమా ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్ కు కావాల్సినంత ఫీస్ట్ అందిస్తుందని చెబుతున్నారు. కె.జి.ఎఫ్ నిర్మించిన హొంబలె ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఈమధ్య వచ్చిన సలార్ టీజర్ కూడా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పార్ట్ 1 తోనే భారీ రికార్డులు గురి పెట్టారు మేకర్స్.

ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా ఇదే అవుతుందని అనుకుంటుండగా సినిమా ఇంకా లేట్ చేస్తూ వారి ఎగ్జైట్ మెంట్ పెంచుతున్నారు మేకర్స్. సలార్ 1 మార్చి కి వస్తే కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు వైజయంతి మేకర్స్. మరి రెండు నెలల్లో ప్రభాస్ రెండు భారీ సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందిస్తాయని చెప్పొచ్చు.

Also Read :  Ram Skanda : ఐదు యాక్షన్ బ్లాక్స్.. సీట్లలో ఎవరు ఉండరా..!

  Last Updated: 23 Sep 2023, 07:02 PM IST