Salaar Trailer : సలార్ ట్రైలర్ రిలీజయ్యేది అప్పుడేనా.. చిత్రయూనిట్ పోస్ట్.. ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్..

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్(Salaar Part 1 Cease Fire) డిసెంబర్ 22న కచ్చితంగా రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Prabhas Salaar Part 1 Trailer will Release Soon

Prabhas Salaar Part 1 Trailer will Release Soon

ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్(Salaar Part 1 Cease Fire) డిసెంబర్ 22న కచ్చితంగా రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది.

బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. దీంతో అభిమానులంతా సలార్ కోసం ఎదురు చూస్తున్నారు. అసలే సలార్ సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని ఫీల్ అవుతుంటే మరో పక్క అసలు ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వకుండా అభిమానులను నిరాశకు గురిచేస్తున్నారు చిత్రయూనిట్.

తాజాగా ప్రభాస్ సలార్ ట్రైలర్(Salaar Trailer) అనౌన్స్మెంట్ త్వరలో ఇస్తామని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఎప్పుడో చెప్పమని, త్వరగా రిలీజ్ చేయమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ సలార్ సినిమా ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అధికారికంగా మాత్రం ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రకటించలేదు. టీజర్ తోనే సలార్ మీద హైప్ పెంచగా ఇక ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ కి వెళ్తాయో చూడాలి.

 

Also Read : Samantha : విడాకులు, సినిమా ఫ్లాప్స్, ఆరోగ్య సమస్యలు.. అన్ని ఒకేసారి వచ్చాయి.. సమంత సంచలన వ్యాఖ్యలు..

  Last Updated: 10 Nov 2023, 06:44 AM IST