Prabhas Salaar: ప్రభాస్ సలార్ చిత్రం డిసెంబర్ 22, 2023 న థియేటర్లలో విడుదలైంది. అప్పటి నుండి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సాలార్ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అదే విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఇలా వ్రాశారు. “𝑫𝑬𝑽𝑨 𝑹𝑬𝑷𝑨𝑰𝑹𝑰𝑵𝑮 𝑑𝑶𝑿 𝑑𝑭𝑪𝑰 𝑹𝑫𝑺. #SalaarCeaseFire ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹ 𝟓𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 వద్ద భారీ వసూళ్లను దాటింది.”
ప్రతి భాషలో డ్రాప్ లేకుండా ఈ సినిమా కలెక్షన్లు ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించాయి. బాహుబలి ఫ్రాంచైజీ వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, ప్రభాస్ మిక్స్డ్ టాక్ అందుకున్న చిత్రాలతో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొనసాగించాడు. తెలుగు రాష్ట్రాల్లో మంచి ట్రాక్ రికార్డ్ తో దుమ్మురేపుతోంది.
సలార్: పార్ట్ 1 కు KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. దీనిని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్, శ్రుతి హాసన్, బాబీ సింహా, జగపతి బాబు టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు కీలక పాత్రలు పోషించారు. చాలా కాలంగా తర్వాత డార్లింగ్ ప్రభాస్ భారీ హిట్ ను అందుకున్నాడు.
Also Read: Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి