Site icon HashtagU Telugu

Salaar Vs Dunki : ప్రభాస్ దెబ్బకి షారుఖ్ దరిదాపుల్లో కూడా లేడుగా.. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..

Prabhas Salaar Day 1 Collections are More Higher than Shah Rukh Khan Dunki Collections

Prabhas Salaar Day 1 Collections are More Higher than Shah Rukh Khan Dunki Collections

ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన సలార్(Salaar) సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు మూడేళ్ళుగా వెయిట్ చేశారు. ఇన్నాళ్ల నిరీక్షణకు ప్రభాస్ ప్రేక్షకులని మెప్పించాడు. మొదటి ఆట నుంచే సలార్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ కొట్టింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తాయని ముందునుంచి అనుకున్నారు.

తాజాగా చిత్రయూనిట్ అధికారికంగా సలార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ప్రకటించింది. సలార్ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అసలు అభిమానులు కూడా ఈ రేంజ్ లో కలెక్ట్ అవుతుందని ఊహించలేదు. షారుఖ్(Shahrukh Khan) డంకీ(Dunki) సినిమా ఉంది కాబట్టి 150 కోట్ల వరకు రావొచ్చు అనుకున్నారు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ బాక్సాఫీస్ పై ప్రభాస్ దెబ్బ అని అంటున్నారు.

అయితే వరుస భారీ హిట్స్ తో ఉన్న షారుఖ్ సలార్ కి ఒక్క రోజు ముందు డంకీ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ హిట్ అవుద్ది, కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు. కానీ సినిమా ఎమోషనల్ డ్రామా కావడం, కేవలం హిందీలోనే రిలీజవ్వడంతో కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చాయి. షారుఖ్ డంకీ సినిమా మొదటి రోజు కేవలం 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. రెండో రోజు 40 కోట్ల వరకు కలెక్ట్ చేసి రెండు రోజుల్లో కేవలం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది డంకీ.

ఇక నార్త్ లో సలార్ కి థియేటర్స్ ఇవ్వొద్దని, డంకీ సినిమానే ఆడించాలని పలువురు ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల ఇదే జరిగింది. లేకపోతే సలార్ సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి అని సినీ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రభాస్ సలార్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి తన కలెక్షన్స్ తో మరోసారి బాలీవుడ్ ని భయపెట్టి షారుఖ్ డంకీని రెండు రోజుల కలెక్షన్స్ కలిపినా దరిదాపుల్లో కూడా లేకుండా చేశాడు.

Also Read : Bandi Trailer : హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా? ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్‌తో ‘బంధీ’.. ట్రైలర్ రిలీజ్..