Salaar 2 : సలార్ 2 షూటింగ్ అప్డేట్.. ఆల్రెడీ ప్రభాస్ సీన్స్ కంప్లీట్.. జులై నుంచి..

సలార్ 1 సమయంలోనే ప్రభాస్ కి సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేసారట. అక్టోబర్ నాటికీ సెకండ్ పార్ట్ షూటింగ్ మొత్తం..

Published By: HashtagU Telugu Desk
Prabhas Salaar 2 Shouryaanga Parvam Shooting Update

Prabhas Salaar 2 Shouryaanga Parvam Shooting Update

Salaar 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్ ‘శౌర్యంగ పర్వం’ (Salaar Shouryaanga Parvam) కోసం ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అయితే మొదటి భాగం రిలీజయ్యి ఐదు నెలలు అయ్యిపోయినా.. సెకండ్ పార్ట్ షూటింగ్ అప్డేట్ ని ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఇవ్వలేదు.

ఇక కొన్ని రోజుల నుంచి తెలుగు ఫిలిం వర్గాల్లో మరో వార్త వైరల్ అవుతుండడంతో.. సలార్ 2 ఇప్పటిలో రాదా అనే సందేహం మొదలైంది. ఆ వార్త ఏంటంటే.. ప్రశాంత్ నీల్ సలార్ 2ని పక్కన పెట్టేసి NTR31 ని స్టార్ట్ చేయబోతున్నారని. ఇక ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. సలార్ 2కి సంబంధించిన కొంత షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిపోయిందట.

మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే సెకండ్ పార్టుకి సంబంధించిన కొన్ని షాట్స్ ని పూర్తి చేశారట. వీటిలో ప్రభాస్ కి సంబంధించిన సీన్స్ ఎక్కువ ఉంటాయట. కాబట్టి ప్రభాస్ ఈ సినిమా కోసమా మరికొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుందట. ఈ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారట. ముందుగా ప్రభాస్ లేని సీన్స్ అన్ని పూర్తి చేస్తారట. జులై నుంచి ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తారట.

ఆల్రెడీ కొంతభాగం షూటింగ్ పూర్తి అయ్యిపోవడంతో.. అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిపోతుందట. ఇందుకోసం ప్రశాంత్ నీల్ పక్కా ప్లాన్ వేసారట. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ సినిమాని మొదలు పెట్టనున్నారట. మరి అక్టోబర్ నాటికీ సలార్ 2 షూటింగ్ మొత్తం పూర్తి అయితే.. రిలీజ్ ఈ ఏడాదిలోనే ఉండే అవకాశం ఉంటుంది.

Also read : Mahesh Babu : మహేష్ బాబు వల్ల నా అహం దెబ్బతింది.. సీనియర్ యాక్టర్ రంగనాథ్..

  Last Updated: 04 May 2024, 05:27 PM IST