Prabhas : సలార్ వల్ల రిలీజ్ గందరగోళం..!

Prabhas సలార్ క్రిస్మస్ కి వస్తుంటే నాని, వెంకటేష్, నితిన్ సినిమాలు వస్తాయా

Published By: HashtagU Telugu Desk
Prabhas Salaar 1 Movies In

Prabhas Salaar 1 Movies In

ప్రభాస్ సలార్ వల్ల చాలా సినిమాలు రిలీజ్ కన్ ఫ్యూజన్ లో పడ్డాయి. అదేంటి సలార్ వల్ల ఆ సినిమాలన్నీ ఎందుకు అలా అవుతాయని అనుకోవచ్చు. సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన సలార్ ఏవో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దసరా దీపావళి అంటూ ఊరించి ఏకంగా క్రిస్మస్ రేసులో డిసెంబర్ 22న సలార్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఆల్రెడీ సలార్ కన్నా ముందే నాని హాయ్ నాన్న, వెంకటేష్ సైంధవ్, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా సినిమాలన్నీ కూడా డిసెంబర్ 22, 23న రిలీజ్ లాక్ చేశాయి.

తెలుగు సినిమాకు సంక్రాంతి సెంటిమెంట్ ఎలానో క్రిస్మస్ రేసులో వచ్చిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు Prabhas సలార్ (Salaar) క్రిస్ మస్ కి వస్తుంటే నాని, వెంకటేష్, నితిన్ సినిమాలు వస్తాయా లేదా అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది.

నాని హాయ్ నాన్న క్రిస్ మస్ కన్నా ముందు రెండు వారాలు ముందుకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ క్రిస్ మస్ కి డేర్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోపక్క సైంధవ్ (Saindhav) సినిమా క్రిస్మస్ నుంచి జనవరి 26కి వాయిదా వేస్తారని తెలుస్తుంది.

డిసెంబర్ ఫస్ట్ వీక్ అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అవుతుండగా 13న కెప్టెన్ మిల్లర్ అంటూ ధనుష్ వస్తున్నాడు. సో ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నాయి. Prabhas సలార్ వల్ల ఈ సినిమాలన్నీ రిలీజ్ డేట్లు మార్చుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Also Read : Rajinikanth : జైలర్ హుకుం సాంగ్.. బ్యాక్ స్టోరీ ఇదే..!

  Last Updated: 30 Sep 2023, 10:57 PM IST