Site icon HashtagU Telugu

Prabhas : ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్

Prabhas Rudra

Prabhas Rudra

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం తన సొంత సినిమాలే కాకుండా మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో ప్రభాస్ సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఐతే ఆమధ్య వచ్చిన కన్నప్ప టీజర్ లో ప్రభాస్ జస్ట్ రెండు సెకన్లు మాత్రమే అది కూడా ప్రభాస్ కళ్లని మాత్రమే చూపించారు. ఐతే లేటెస్ట్ గా కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. రుద్ర లుక్ తో ప్రభాస్ (Prabhas) లుక్ అదిరిపోయింది.. ఈ లుక్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది.

Cyberabad Traffic Pulse : హైదరాబాద్ వాహనదారుల ట్రాఫిక్ కష్టాల‌ను తీర్చే కొత్త మార్గం

భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్లను వదులుతూ క్యారెక్టర్ లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడి పాత్ర పోషిస్తూ ఉండగా.. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) పార్వతీదేవి పాత్ర పోషిస్తున్నట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేసారు. కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో కర్రతో నుదుట విభూది ధరించి, మెడలో రుద్రాక్షలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ను మునుపెన్నడు చూడని సరికొత్త క్యారెక్టర్ లో అభిమానులు చూసి సర్ప్రైజ్ అవుతున్నారని చెప్పవచ్చు. ” ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు.. రుద్ర ..” అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version