Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్.. లక్కీ ఛాన్స్..!

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడని తెలిసిందే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ 1 తో వచ్చి సత్తా చాటిన ప్రభాస్ సమ్మర్ కి కల్కితో ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - March 11, 2024 / 01:10 PM IST

Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడని తెలిసిందే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో సలార్ 1 తో వచ్చి సత్తా చాటిన ప్రభాస్ సమ్మర్ కి కల్కితో ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ 2, స్పిరిట్ సినిమాలు లైన్ లో పెట్టాడు. వీటితో పాటుగా హను రాఘవపుడితో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే వస్తుందని తెలుస్తుంది. సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను ప్రభాస్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా మళ్లీ మృణాల్ ఠాకూర్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సీతారామం లో మృణాల్ నటన తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. నార్త్ లో తనకున్న ఇమేజ్ ని ఓవర్కం చేసి మృణాల్ తెలుగులో స్టార్ క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ప్రభాస్ తో మృణాల్ రొమాన్స్ నిజం అయితే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Tamannah : 19 ఏళ్ల కెరీర్ లో అతనిలాంటి వాడిని చూడలేదు..!