Rajasaab : ప్రభాస్(Prabhas) ఆల్మోస్ట్ అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ జానర్, ప్రభాస్ మొదటి సారి హారర్ సినిమా చేయడం, ప్రభాస్ మొదటిసారి ముసలి పాత్ర చేయడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.
రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్.. ఇలా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ రాజాసాబ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తమన్ మాట్లాడుతూ.. బాహుబలి నుంచి ప్రభాస్ చేసినవన్నీ రెగ్యులర్ ఫార్మేట్ కి భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాటిల్లో మాస్ సాంగ్స్, రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్ లేవు. రాజాసాబ్ కమర్షియల్ సినిమా. ఇందులో కమర్షియల్ సాంగ్స్, డ్యూయెట్ సాంగ్, ఐటెం సాంగ్ అన్ని ఉన్నాయి. ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్ కోసం జపనీస్ వర్షన్ లో ఒక పాట తయారుచేస్తున్నాం. అలాగే ఆడియో లాంచ్ ని జపాన్ లో అనుకుంటున్నారు. రాజాసాబ్ ఆల్బమ్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మాస్ సాంగ్స్ తో రాబోతున్నారు అని చెప్పారు.
Thaman About Raja Saab Movie 🔥🔥🔥🔥🔥🔥🔥#Prabhas #TheRajaSaab pic.twitter.com/I9orRH5CPV
— CINEMA PANNEL (@cinemapannel) January 7, 2025
దీంతో తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ మళ్ళీ కమర్షియల్ సాంగ్స్ తో కనిపిస్తాడని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక జపాన్ లో మన తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ కి, ప్రభాస్ సినిమాలకు అక్కడ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ సినిమాలను అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే జపాన్ లో ఆడియో లాంచ్ ప్లాన్ చేసి జపాన్ లో మార్కెట్ మరింత పెంచేందుకు చూస్తున్నారు మూవీ టీం. ఇటీవల కల్కి జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ కి ప్రభాస్ జపాన్ కి వెళ్లాల్సి ఉన్నా కాలికి గాయం అవ్వడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. ఇప్పుడు రాజాసాబ్ ఆడియో లాంచ్ కి ప్రభాస్ జపాన్ వెళ్తాడని అక్కడి ఫ్యాన్స్ కి తెలిస్తే ఎగిరి గంతేస్తారేమో. ఇక రాజాసాబ్ సినిమాని ఏప్రిల్ 10 రిలీజ్ చేస్తామని ప్రకటించినా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read : Balakrishna : థియేటర్స్ లో అల్లరి చేయండి.. ఆగం చేయకండి.. అమెరికా ఫ్యాన్స్ కు బాలయ్య హెచ్చరిక..