RajaSaab : ప్రభాస్ వచ్చే సమ్మర్ కి రాజాసాబ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మారుతీ దర్శకత్వంలో హారర్ కామెడీ లవ్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసారు. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా అప్డేట్ అడుగుతున్నారు.
దీంతో ప్రభాస్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే ప్రభాస్ రాజాసాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. గళ్ళ చొక్కా, లోపల టీ షర్ట్, బ్లాక ప్యాంట్, షూస్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని అదిరిపోయే లుక్స్ తో నిలబడ్డాడు ప్రభాస్. దీంతో ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. ప్రభాస్ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
అలాగే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అక్టోబర్ 23 వస్తుందని కూడా ప్రకటించారు. దీంతో ప్రభాస్ పుట్టిన రోజు నాడు రాజాసాబ్ నుంచి మరో గ్లింప్స్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుండగా ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Swag turned up to the MAX 😎
&
Now….your Celebrations will go off in STYLE 😉A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW
— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024
Also Read : Adar Poonawalla : బాలీవుడ్‌లోకి వ్యాక్సిన్ తైకూన్.. కరణ్ జోహర్ కంపెనీలో రూ.1000 కోట్ల పెట్టుబడి