RajaSaab Glimpse : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇటీవలే కల్కి సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి జోష్‌లో ఉన్నాడు. థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన కల్కి సినిమా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ (RajaSaab ) మూవీ ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.
తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ బండి మీద స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పూలతో తనకి తానే దిష్టి తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్‌గా మారింది. హారర్, రొమాంటిక్, కామెడీ కథాంశంతో పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే.. సమ్మర్ వాయిదా వేసినట్లుగా చిత్ర బృందం తెలియజేసింది. ఏప్రిల్ 10 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
Also Read : Harish Shankar : నాకు, పూరి జగన్నాధ్ కి గొడవలు లేవు.. అది ఛార్మి ఇష్టం..