RajaSaab Teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా *‘రాజాసాబ్’*పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘కల్కి 2898 ఎ.డి’ తర్వాత డార్లింగ్ చేస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ఇదే కావడం విశేషం. పాటలు, యాక్షన్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసే ఈ రొమాంటిక్ హారర్ కామెడీకి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ప్రభాస్ కొత్తగా వింటేజ్ లుక్‌లో కనిపించబోతుండటం, అలాగే ఇది ఆయన తొలి హారర్ రొమాంటిక్ కామెడీ కావడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పట్ల పాజిటివ్ బజ్ కొనసాగుతోంది. దర్శకుడు మారుతి తన స్టైల్‌లోనే హ్యుమర్‌తో పాటు డార్లింగ్‌కు కొత్త షేడ్స్ చూపించనున్నాడు.
ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ప్రభాస్ అభిమానులకు పండుగలా మారింది. వింటేజ్ లుక్‌లో డార్లింగ్ గెటప్ ఆకట్టుకోగా, తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత పండించాడు. ముఖ్యంగా టీజర్ చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. టీజర్ చూసిన తర్వాత “ఇదే మేము డార్లింగ్ నుండి కోరుకున్న ఎంటర్టైన్మెంట్” అంటూ అభిమానులు మారుతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా టీజర్‌ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెలెక్టెడ్ థియేటర్లలో ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా స్క్రీన్ చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. భారీ అంచనాల నడుమ ‘రాజాసాబ్’ ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలో విడుదల కానుంది.