Prabhas Raja Saab ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు. రాజా సాబ్ టైటిల్ కి తగినట్టుగానే ప్రభాస్ రాజు లుక్ అదిరిపోయింది. సినిమా గ్లింప్స్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా వదిలి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సినిమా 2025 సంక్రాంతికి వస్తుందని అంచనా వేయగా సమ్మర్ కి షిఫ్ట్ చేస్తూ సూపర్ అనిపించారు.
ఏప్రిల్ 10, 2025 నాడు ప్రభాస్ రాజా సాబ్ వస్తుంది. ఐతే ఈ సినిమాకు వారం తర్వాత అంటే ఏప్రిల్ 18న తేజా సజ్జా మిరాయ్ (Mirai) సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో హనుమాన్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ఈ మిరాయ్ లో మంచు మనోజ్ (Manchu Manoj) నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఐతే ఈ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తుంది.
ప్రభాస్ రాజా సాబ్ వర్సెస్ తేజా సజ్జా మిరాయ్ రెండు సినిమాలు ఒకే ప్రొడక్షన్ నుంచి వస్తూ సరిగ్గా వారం గ్యాప్ లోనే రిలీజ్ అవుతూ పోటీ పడుతున్నాయి. కచ్చితంగా ప్రభాస్ సినిమాతో తేజాకి పెద్ద షాక్ తగులుతుందని చెప్పొచ్చు. ఐతే మిరాయ్ మీద ఎంత నమ్మకం ఉన్నా ఇలా స్టార్ సినిమా రిలీజ్ వారం తర్వాత వదిలినా కష్టమే.
మిరాయ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పకుండా ఇలా తమ ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాను వారం ముందు రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వరుస క్రేజీ సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ సినిమాలను చేస్తుంది. మరి ఈ సినిమాలన్ని సక్సెస్ అయితే వాళ్లు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ గా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.