Prabhas Raja Saab : రాజా సాబ్ హైలెట్స్ ఇవే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ పక్కా..!

Prabhas Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. ఈ సినిమా గురించి మారుతి సూపర్ కాన్ఫిడెంట్ గా

Published By: HashtagU Telugu Desk
Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. ఈ సినిమా గురించి మారుతి సూపర్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ సినిమా హైలెట్స్ గురించి ఒక న్యూస్ వైరల్ అయ్యింది.

రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. సినిమాలో ప్రభాస్ చాలా డైలాగ్స్ చెబుతాడని. ఈమధ్య సినిమాల్లో ప్రభాస్ చేయని ప్రత్యేకమైన శైలిలో ఈ సినిమాలో అతని పాత్ర ఉంటుందట.

ఇక మరోపక్క సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. థ్రిల్లర్ అంశాలు కూడా అలరిస్తాయని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతాయని తెలుస్తుంది. రాజా సాబ్ సీమాలో ప్రభాస్ ని చూసి అందరు సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు. సినిమాలో మాళవిక మొహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఐ ఫీస్ట్ అందిస్తుందని సంక్రాంతికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని అంటున్నారు. సలార్ తో లాస్ట్ ఇయర్ చివర్లో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ మే లో కల్కి గా రాబోతున్నాడు. ఇక రాజా సాబ్ సినిమా 2025 సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నాడు.

Also Read : Anushka Krish క్రిష్ తో స్వీటీ.. సరోజా గుర్తుందిగా.. నెక్స్ట్ బిగ్ మూవీ..!

  Last Updated: 09 Feb 2024, 09:26 AM IST