Site icon HashtagU Telugu

Project K Title: ప్రాజెక్ట్K అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్… ఎప్పుడంటే!

Project K Title

New Web Story Copy 2023 06 22t173647.533

Project K Title: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ప్రాజెక్ట్K. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కీలక రోల్ లో కనిపించనున్నారు. 600 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ రివీల్ కు చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలోనే ప్రాజెక్ట్K చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తరువాత ప్రభాస్ ప్రాజెక్టుK చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రాజెక్ట్K చిత్రంపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై కనిపించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్K చిత్ర అఫీషియల్ టైటిల్ ను రివీల్ చేసేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారట.

ప్రాజెక్ట్K చిత్ర అఫీషియల్ టైటిల్ ను జూలై 7న అమెరికాలో రివీల్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ మేకర్స్ కూడా అటెండ్ అవ్వచ్చని తెలుస్తుంది.

Read More: Prabhas Fans: ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ అభిమానుల భారీ ఆశలు!

Exit mobile version