Site icon HashtagU Telugu

Prabhas-Prasanth Varma: ప్రభాస్, ప్రశాంత్ వర్మ మూవీ టైటిల్ ఇదే.. అంచనాలు పెంచుతున్న హనుమాన్ డైరెక్టర్!

Prabhas Prasanth Varma

Prabhas Prasanth Varma

టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా ఇంకా పూర్తవ్వకముందే మరొక సినిమాకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్. చేతినిండా బోలెడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

స్టోరీ లైన్‌ నచ్చితే ఓకే చెప్పేసి 365 డేస్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉండేలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. డైరీలో ఖాళీ పేజీ లేని హీరో ఎవరంటే ప్రభాస్‌ అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇకపోతే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్‌. ఆ తర్వాత స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు కూడా రెడీ అవుతున్నాడు. అస్సలు ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడు రెబల్ స్టార్. ఇన్ని సినిమాలు ఉన్నా కూడా ఆయన డేట్స్‌ కోసం చాలా మంది డైరెక్టర్స్, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అలా వెయిటింగ్‌ లో ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు.

మైత్రి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్‌ తో ఒక సినిమా చేయబోతున్నారు ప్రశాంత్‌ వర్మ. ఈ మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్. హనుమాన్ తర్వాత ఆ రేంజ్‌ లో ప్రశాంత్‌ వర్మ సినిమా ఉండబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు బక అని టైటిల్‌ కూడా ఫిక్స్ చేశారని టాక్. ఇది మహాభారతంలోని బకాసురుడి కథ అనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ చేయబోతున్న మొదటి పూర్తిస్థాయి మైథలాజికల్ సినిమాగా దీన్ని భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించబోతున్నారట. అయితే బక మూవీ షూటింగ్ స్టార్ట్ కావటానికి కాస్త టైమ్ పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.