Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో కూడా చాలా హుందాగా నడుచుకుంటుంటారు. ఏది పడితే అది ట్వీట్ చేయడం, లేక అనవసరమైన ట్వీట్స్ ని రీట్వీట్ చేయడం లాంటివి అసలు చేయరు. బిగ్ బి రీషేర్ చేసే ట్వీట్ ఏమైనా ఉన్నాయంటే.. అవి తన సినిమాల గురించిన ట్వీట్స్, లేక అభిషేక్ బచ్చన్ కి సంబంధించిన ట్వీట్స్. అయితే ఈరోజు ఉదయం నుంచి అమితాబ్.. సాధారణ నెటిజెన్స్ చేసిన కొన్ని ట్వీట్స్ ని వరుసపెట్టి రీ షేర్ చేస్తూ వస్తున్నారు.
రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ కూడా ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు వారలు క్రిందట రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మూవీ టీం నుంచి మాత్రం, ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ట్రేడ్ పండితులు మరియు కొన్ని మీడియా వర్గాలు చెప్పిన వార్తలు విని.. పఠాన్ అండ్ కల్కి పోల్చుతూ ట్వీట్స్ వేస్తున్నారు. ఈక్రమంలోనే కొందరు నెటిజెన్స్ వేసిన ట్వీట్స్ ని అమితాబ్ వరుసపెట్టి రీ షేర్ చేస్తూ వస్తున్నారు. అమితాబ్ నుంచి ఇలాంటి ట్వీట్స్ ఎవరు ఉహించలేదు. దీంతో అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ ఏమైనా హాక్ అయిందా అనే సందేహం కలుగుతుంది. అయితే అమితాబ్ మాత్రం ఇప్పటివరకు దీనిపై రియాక్ట్ అవ్వలేదు.
quite amazing https://t.co/5uX6S2Cenj
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024
ufff quite amazing https://t.co/IpgpWsjNyr
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024
wah wah wah https://t.co/ZbwXDKLIpe
— Amitabh Bachchan (@SrBachchan) July 12, 2024