Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ పేరు మార్చుకున్న విషయం తెలుసా? ఇకపై ప్రభాస్ పేరు..?

Prabhas name changing for Rajasaab Movie goes Viral

Prabhas name changing for Rajasaab Movie goes Viral

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవలే సలార్(Salaar) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఏకంగా 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా. బాహుబలి(Bahubali) తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ సలార్ తోనే వచ్చింది. కలెక్షన్స్ కూడా బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల కంటే కూడా దీనికే ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రభాస్, చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ సలార్ సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు.

ఇక సలార్ తర్వాత ఈ సమ్మర్ కి కల్కి(Kalki) సినిమాతో రాబోతున్నాడు. కల్కి 2898AD సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. ఈ సినిమా మే 9న రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత ‘రాజాసాబ్'(Rajasaab) సినిమాతో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ని నిన్నే సంక్రాంతికి ప్రకటించి లుంగీ పైకెత్తి నడుస్తున్న ప్రభాస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా పోస్టర్ లో ప్రభాస్ పేరు ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ప్రభాస్ పేరుని ఇంగ్లీష్ లో ‘Prabhas’ అని రాస్తారు. ప్రభాస్ అన్ని సినిమాల టైటిల్స్ లోను ఇదే రాశారు. ఇటీవల వచ్చిన సలార్, రాబోయే కల్కి సినిమా పోస్టర్స్ లో కూడా ఇదే వేశారు. కానీ రాజాసాబ్ పోస్టర్ మీద ‘Prabhass’ అని వేశారు. పేరులో ఇంకో ఎక్స్ట్రా S జతచేర్చారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

ప్రభాస్ పేరులో ఒక లెటర్ ఎందుకు చేర్చుకున్నాడు? చేర్చుకుంటే కలిసొస్తుందని ఎవరైనా న్యూమరాలజిస్ట్ చెప్పాడా? లేక జ్యోతిష్యులు ఎవరైనా చెప్పారా? లేదా ప్రింట్ మిస్టేక్ పడిందా? ఇటీవల జ్యోతిష్కుడు వేణు స్వామి ప్రభాస్ కి కలిసి రాదు అని జాతకం చెప్పగా వైరల్ అయింది. మరి కలిసి రావడానికి సినిమాలు హిట్లు కొట్టడానికి పెట్టుకున్నాడేమో? ఇకపై వచ్చే సినిమాలకు ఇలాగే పడుతుందా అని ప్రభాస్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ‘Prabhas’ కి ఒక S ఎక్స్ట్రా ఎందుకు చేర్చారో ప్రభాస్ కే తెలియాలి.

Also Read : Kanguva : భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సూర్య సినిమా.. ‘కంగువ’ రెడీ అవుతుంది..