ఇటీవలే ప్రభాస్(Prabhas) ‘సలార్'(Salaar) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారీ లైనప్స్ తో మరిన్ని రికార్డులు కొట్టడానికి రెడీగా ఉన్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి 2898AD(Kalki 2898AD) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా కల్కి రిలీజ్ డేట్ పై వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి అనుకున్నా షూటింగ్ అవ్వక కల్కి వాయిదా పడింది. తాజాగా కల్కి సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్. నేడు ముంబై, హైదరాబాద్, విజయవాడ.. ఇలా పలు ఊర్లల్లో థియేటర్స్ లో కల్కి సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. అలాగే ముంబై వీధుల్లో కల్కి సినిమాలో ఉండే విలన్స్ లాగా బ్లాక్ డ్రెస్ గెటప్స్ తో కల్కి రిలీజ్ డేట్ పోస్టర్స్ పట్టుకొని తిరుగుతున్నారు. కల్కి సినిమాని మే 9 న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ కూడా అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఓ సరికొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కల్కి సినిమాని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. ఆ సంస్థ నుంచి ఇదే డేట్ మే 9న జగదేకవీరుడు అతిలోక సుందరి, మహర్షి, మహానటి సినిమాలు రిలీజ్ అయి భారీ విజయం సాధించాయి. ఇప్పుడు కల్కి సినిమాని కూడా ఇదే డేట్ కి తీసుకొస్తున్నారు. మే 9న కల్కి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో సమ్మర్ లో ప్రభాస్ మరోసారి రికార్డులు సెట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సారి హాలీవుడ్ రేంజ్ లో కల్కి అదరగొట్టబోతుంది.
The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/gXsOWTqH7X
— Kalki 2898 AD (@Kalki2898AD) January 12, 2024