Kalki First Day Collections : కల్కి 2898AD ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

కల్కి సినిమా కూడా ముందు నుంచి 200 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 03:25 PM IST

Kalki First Day Collections : ప్రభాస్ కల్కి 2898AD సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలోని యాక్షన్ సీన్స్, మహాభారతం విజువల్స్, ప్రభాస్ – అమితాబ్ ఫైట్స్, కలియుగాంతం విజువల్స్.. ఇలా అన్ని ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. సినిమా సూపర్ గా ఉన్నందుకు, హిట్ అయినందుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. బాహుబలి 2 సినిమా నుంచి ప్రభాస్ ప్రతి సినిమా మొదటి రోజు 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దాటుతుంది. కల్కి సినిమా కూడా ముందు నుంచి 200 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే కల్కి సినిమా మొదటి రోజు 191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కల్కి సినిమా దాదాపు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నార్త్ లో కూడా ఈ సినిమా దాదాపు 30 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక అమెరికాలో ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి 5.1 మిలియన్ డాలర్స్ అంటే మన లెక్కల్లో దాదాపు 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది కల్కి. అమెరికాలో 5 మిళియన్స్ ఇంత ఫాస్ట్ గా కలెక్ట్ చేసిన సినిమా కల్కినే. దీంతో ప్రభాస్ అభిమానులు సరికొత్త రికార్డులు సృస్టిస్తున్నందుకు ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read : Kamal Hassan : కమల్ పారితోషికం పెంచడంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

ఇక వీకెండ్ మూడు రోజులు ఉండు కాబట్టి ఈ నాలుగు రోజుల్లోనే ఈజీగా 600 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.